ఎమ్మెల్యే గారు సుస్వాగతం..!
– రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
– అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు ఘనంగా సుస్వాగతం పలికారు. గత నెల 27 నుంచి 29 వరకు అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఉత్సవాలలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని శుక్రవారం తాండూరుకు వచ్చారు. ఈ సందర్భంగా తాండూరు క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, అస్లాం, బొంబీనా, స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్‌చారి, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంతోష్‌గౌడ్, ఉర్ధుఘర్ మాజీ చైర్మన్ యువనాయకులు చంటి యాదవ్ తదితరులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి స్వదేశాగమన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి, మొక్కలను అందజేశారు.


