నుపూర్ శర్మ, న‌వీన్‌కుమార్‌ల‌పై చర్యలు తీసుకోవాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నుపూర్ శర్మ, న‌వీన్‌కుమార్‌ల‌పై చర్యలు తీసుకోవాలి
-మున్సిపల్ నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
– చైర్ పర్సన్‌తో ముస్లిం సోదరుల విజ్ఞప్తి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందల్ పై చర్యలు తీసుకోవాలని తాండూరు ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మైనార్టీ నాయకులు అప్పూ(నయూం), మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు ఆలీ, అబ్దుల్ రజాక్, బొంబీనా, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి తదితరులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా సామరస్యంగా జీవిస్తుంటే మతం ముసుగులో బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ లు మ హమ్మద్ ప్రవక్తపై అనుచిత వాఖ్యలు చేసి ముస్లిం మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. దీని వ‌ల్ల దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లుగుతుంద‌న్నారు. కావున వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు.