మీ నాయ‌క‌త్వంలోనే సాగుతాం

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మీ నాయ‌క‌త్వంలోనే సాగుతాం
– ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్ ప‌ర్స‌న్‌ల‌ను క‌లిసిన నేత‌లు
– జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునీతారెడ్డికి సంఘీభావం
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిల నాయ‌క‌త్వాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ వీడ‌కుండా వారి వెంటే సాగుతామ‌ని టీఆర్ఎస్ తాండూరు మండల నేతలు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి, చేవేళ్లలో పీఎంఆర్ మెడికల్ కళాశాల వద్ద ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, అల్లాపూర్ స‌ర్పంచ్ నందిని యాద‌య్య గౌడ్, చెంగోల్ ఎంపీటీసీ రత్నమాల రాము యాదవ్ ఆధ్వర్యంలో యువకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కలిగిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిల వెంటే ఉంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, జెడ్పీచైర్ పర్సన్ లను కలిసిన వారిలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు రాము, ఉపసర్పంచ్ లక్ష్మయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరేష్ యాదవ్, బాలరాజు, సురేందర్, నరేష్, చెన్నప్ప, విజయ్ తదితరులు ఉన్నారు.