సేవా కార్య‌క్ర‌మాల‌తో కేటీఆర్ జన్మదినం

తాండూరు రాజకీయం వికారాబాద్

సేవా కార్య‌క్ర‌మాల‌తో కేటీఆర్ జన్మదినం
– రోగులకు పండ్లు, బందువుల‌కు అన్న‌దానం
– కేక్ క‌ట్ చేసి బ‌ర్త్ డే సంబ‌రాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి జననేత తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. కేటీఆర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆదివారం తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మానికి మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ హాజ‌రై కౌన్సిల‌ర్లు అబ్దుల్ ర‌జాక్, ర‌వి, రాము, వెంక‌న్న గౌడ్, యువ‌నాయ‌కులు బిర్క‌డ్ ర‌ఘు, ద‌త్తూ త‌దిత‌రుల‌తో క‌లిసి అన్న‌దానం చేశారు.

అదేవిధంగా మున్సిపల్ పరిధి రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ఉపాధ్యక్షులు జావిద్ ఆధ్వర్యంలో నిర్వ‌హించే బర్త్ డే వేడుక‌ల‌కు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారీ తదితరులు హాజ‌రై కేక్ క‌ట్ చేసి పంచిపెట్టుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ పట్టణ బీసీ కమిటీ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బీసీ కమిటి అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు యోగానంద్, ఉపాధ్యక్షులు కోటం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చంటి యాదవ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు విజయ్. ఇంతియాజ్, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రోవైపు ప‌ట్ట‌ణంలోని 36వ వార్డులో టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ న‌రుకుల సిందూజ న‌రేంద‌ర్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌ల‌తో క‌లిసి ఆమె కేక్ క‌టింగ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తండ్రితో పాటు తెలంగాణ ఉద్యమంలో మంత్రి కేటీఆర్ కీలకపాత్ర పోషించారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మంత్రిగా అన్నిరంగాల అభివృద్ధికి కేటీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఆదేశాలను అందరు పాటిస్తామని పేర్కొన్నారు.