ప్రశాంతంగా పది పరీక్షలు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రశాంతంగా పది పరీక్షలు
– తొలి రోజు 09 మంది గైర్హాజరు
– గంట ముందే చేరుకున్న విద్యార్థులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పదో తరగతి పరీక్షలు తాండూరులో ప్రశాంతంగా కొనసాగాయి.

శనివారం పదో తరగతి పరీక్షలు సజావుగా ప్రారంభం అయ్యాయి. పది పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణం, మండలంలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందే సూచించిన విధంగా విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వెంట తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వచ్చి వారికి ధైర్యం చెప్పారు. నిర్ణీత సమయంలోనే విద్యార్థులు పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లిపోయారు.

తాండూరులో మొత్తం అన్ని కేంద్రాల‌లో మొదటి రోజు 2319మంది విద్యార్థులకు అలార్ట్‌ చేయగా 2310 మంది విద్యార్థులు హాజరు అయి పరీక్షలు రాసినట్లు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు. వివిధ కారణాల వల్ల 09మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు వెల్లడించారు. 5నిమిషాల నిబంధన ఉండడంతో ఆలస్యంగా ఒక్కరు కూడ హాజరుకాలేదని తెలిపారు. తాండూరులోనీ పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, బెంచీలు తదితర సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా పదో తరగతి పరీక్షలు కొనసాగాయి.

పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డికి జన నీరాజనం..!