సేవతో పాటు విద్య అభివృద్ధికి తోడ్పాటు
– విద్యార్థులు చదువుల్లో రాణించాలి
– ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్
– 435 మందికి టై, బెల్టుల వితరణ
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: సామాజిక సేవతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు సహాకారంతో విద్యార్థులకు ఉచితంగా టై, బెల్టులను అందజేశారు. పాఠశాలలోని వివిధ తరగతులకు చెందిన 435 మంది విద్యార్థులకు రొంపల్లి సంతోష్ కుమార్ స్థానిక గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, తాండూరు వాసవి క్లబ్ సభ్యులతో కలిసి వితరణ చేశారు.

ఈ సందర్భంగా వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ వైశ్య ఫెడరేష్, వాసవి క్లబ్ తరుపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా సేవతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. సందర్భంగా సర్పంచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ. పాఠశాలలో వైశ్య ఫెడరేషన్, వాసవి క్లబ్ కమిటీ సభ్యులు టై, బెల్టులు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ఫెడరేషన్ కోశాధికారి ఆగిరి మహేష్. వాసవి క్లబ్ అధ్యక్షులు గుండల గౌరీ శంకర్, పాఠశాల చైర్మన్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రాములు, వాసవి క్లబ్ సభ్యులు కందుకూరి ప్రమోద్ కుమార్, ప్రవీణ్ కుమార్, వీరేశం, వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.
రొంపల్లి సంతోష్ కుమార్‌కు సన్మానం

మరోవైపు కార్యక్రమం అనంతరం ప్రిన్సిపల్ రాములు, ఉపాధ్యాయులు వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, వాసవి క్లబ్ తాండూర్ అధ్యక్షులు గుమ్మడాల గౌడ శంకర్ గారిని, జిల్లా కోశాధికారి ఆగిరి మహేష్ కుమార్‌లను ఘనంగా సన్మానించారు.



