రేవంత్ వాఖ్యలను వక్రీకరించడం దారుణం
– కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరిస్తోందని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 90 శాతం మంది రైతులు సన్న, చిన్న కారు రైతులు ఉన్నారని, వారి వ్యవసాయానికి సంబంధించి 8 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తే సరిపోతుందని అభిప్రాయాలను వ్యక్తం చేశారని గుర్తుచేశారు. 24 గంటల విద్యుత్ పేరుతో తలెంగాణ ప్రభుత్వం రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారని అన్నారు.
కాని ఎక్కడా కూడా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వోద్దని, ఇవ్వబోమని, ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. గతంలో రైతులకు ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతులు, ప్రజలు అందరు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఇప్పటికైనా నేతలు వక్రీకరించి.. దుష్ప్రచారం చేయొద్దని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి…


