అతిసారతో పూల వ్యాపారి మృతి
– తాండూరు మున్సిపల్ ఘటన
– మృతుడు కాశింపూర్ వాసి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అతిసార బారిన పడిన ఓ పూల వ్యాపారి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి 12వ వార్డులోని గొట్టుగ కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో బషీరాబాద్ మండలం కాశింపూర్‌కు చెందిన పూల గోపాల్ (35)కు అద్దెకు ఉంటున్నాడు.

పట్టణంలో పూల వ్యాపారం నిర్వహించేవాడు. శుక్రవారం రాత్రి నుంచి అతనికి వాంతులు, విరోచనాలు అయినట్లు అతని భార్య తెలిపింది. శనివారం ఉదయం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గోపాల్ మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని కుటుంభీకులు గ్రామానికి తరలించారు.



