థియేటర్లు బంద్..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ సినిమా హైదరాబాద్

థియేటర్లు బంద్..!
– నిలిచిపోనున్న సినిమా ప్రదర్శనలు
– 10 రోజుల పాటు విరామం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ప్రేక్షకులకు ఆహ్లదాన్ని పంచే సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. నేటి నుంచి పది రోజుల పాటు సిని మాల ప్రదర్శనలు నిలిపివేయాలని థియేటర్ల యజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ఈనెల 27వ తేదీ వరకు ఈ విరామం ఉంటుందని వారు వెల్లడించింది. పెద్ద సినిమాల విడుదల లేకపోవ డంతో పాటు చిన్న సినిమాలను ప్రేక్షకు లను ఆదరించడం లేదని భావించిన యజమాన్యాలు విరామాన్ని ప్రకటిం చారు. ఈనెల 30వరకు బంద్ కొనసాగే అవకాశాలు న్నాయి.

ఇదికూడా చదవండి…

మందుబాబులకు పనిష్మెంట్..!