పేదింటి పెళ్లికి సాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదింటి పెళ్లికి సాయం
– పుస్తె మెట్టెలు అందిచిన ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: నిరుపేద కుటుంబంలో జ‌రిగే క‌ళ్యాణానికి పెద్దేముల్ మండ‌ల రైతు స‌హాకార సంఘం చైర్మ‌న్ కానుక అంద‌జేశారు. పేదింట్లో జ‌రిగే అమ్మాయి పెళ్లికి పుస్తె మెట్ట‌ల‌ను అంద‌జేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. పెద్దేముల్ మండలానికి చెందిన కిన్నెరసాని కళాకారుడు డక్క‌లి జంగయ్య ఆగ‌స్టు 4వ తేదిన ఆయ‌న శిరీష వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పేరుకు క‌ళాకారుడు అయినా పేద‌రికంలో ఉండ‌డంతో పెళ్లికి ఆర్థిక ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో పెళ్లికి ఆర్థిక చేయూత అందించాల‌ని జంగయ్య చైర్మ‌న్ ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డిని సంప్ర‌దించ‌డంతో స్పందించిన ఆయ‌న ఆదివారం ఇచ్చిన మాట కోసం పేదింటి పెళ్లికి అమ్మాయికి అందించే పుస్తె మెట్టెల‌ను కానుక‌గా అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ యువ నాయ‌కులు శ్రీ‌కాంత్ రెడ్డి ఉన్నారు.