ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

కెరీర్ తాండూరు వికారాబాద్

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
– తొలిరోజు 223 మంది గైర్హాజరు
– ఆలస్యంగా వచ్చిన విద్యార్థి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తాండూరులో ప్రశాంతంగా జరిగాయి. సోమవారం తొలి రోజు 2707 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 223 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో జనరల్ విభాగంలో 2195 మంది విద్యార్థులకు గాను 170 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా ఒకేషనల్ విభాగంలో 512 మందికి 53 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కస్టోడియన్లు మళ్లినాథ్, మల్లప్పలు తెలిపారు. మరోవైపు పరీక్షష కేంద్రానికి ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో నిర్వాహకులు అనుమతించలేదు. ఎన్టీఆర్ నగర్, హైదరాబాద్ రోడ్డు మార్గంలో కొత్తగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చెయడంతో అయోమయానికి గురికావడంతో ఆలస్యం అయినట్లు విద్యార్థి తెలిపారు.