12 మంది పేకాట రాయుళ్లపై కేసు

క్రైం తాండూరు వికారాబాద్

12 మంది పేకాట రాయుళ్లపై కేసు
– రూ. 35 వేల న‌గ‌దు, పేకాట సెట్లు స్వాదీనం
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేకాట ఆడుతున్న 12 మందిపై తాండూరు మండ‌లం కరణ్ కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం తాండూరు మండలం చెంగోల్ గ్రామ శివారు సర్వేనెంబర్ 80లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఈడ్గి రవిగౌడ్, వినోద్ చౌహాన్, కోయికుంట శ్రీనివాస్, అబ్దు రహీం, ఎండి ఇమ్రాన్, ఈడ్డి వెంకటయ్య గౌడ్, జ‌ర్పుల‌ ప్రకాష్, కేతావత్ విజయ్ కుమార్, షేక్ షహాబాజ్ బైగ్, రాథోడ్ రవి, మహమ్మద్ హరూన్, ఆర్తి రవిశేఖర్‌ల‌ను పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. వారి వద్ద నుంచి రూ. 35 వేల నగదుతో పాటు 5 సెట్లు పేకాట ముక్క‌ల‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు.