తాండూరులో 118 కరోనా కేసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో కరోనా కేసులు తటస్థంగా నమోదవుతున్నాయి. శనివారం తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో మొత్తం 365 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో 289 మందికి, మాతా శిశు ఆసుపత్రిలో 76 మందికి పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ అని తేలిందని పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు.
45 మంది నుంచి రక్తనమూనాల సేకరణ
మరోవైపు తాండూరు పట్టణంలో కోవిడ్ టీకా తీసుకున్న 45 మంది నుంచి రక్తనమూనాలను సేకరించినట్లు డాక్టర్ బాస్కర్ తెలిపారు. తాండూర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కోవిడ్ పై ఐసిఎంఆర్ అధికారులు సర్వే చేపట్టడం జరిగిందని, సర్వేలో భాగంగా స్థానికంగా 45 మంది నుండి అధికారులు రక్త నమూనాలు సేకరించినట్లు వెల్లడించారు.


