వ్యాధులను తరిమేద్దాం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం

వ్యాధులను తరిమేద్దాం..!
– పరిసరాలు శుభ్రం చేసిన చైర్ పర్సన్
– ఇంట్లో చెత్త తొలగించిన కౌన్సిలర్లు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యం బారిన పడకుండా వ్యాధులను తరిమేద్దామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు పాల్పంచుకున్నారు. చైర్ పర్సన్ స్వప్న పరిమల్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. నీరు నిల్వ ఉన్న తొట్టిలను కడిగేశారు. అదేవిధంగా మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రాజీవ్ కాలనీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్ తదితరులు కూడా వారి ఇండ్లలో పరిసరాలను శుభ్రం చేసారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ఆవాసాలు అపరిశుభ్రంగా ఉండటం వల్లనే వ్యాదులు ప్రబలుతాయాన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు కేటాయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులను తారీమేద్దామని పేర్కొన్నారు.