గ్రామాల ప్రగతికి కృషి చేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఏకగ్రీవ సర్పంచులు, ఉపసర్పంచులకు శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామాల ప్రగతికి బాధ్యతగా కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలో 25 గ్రామ పంచాయతీలో సర్పంచులతో పాటు పలువురు ఉప సర్పంచులు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఏకగ్రీవ సర్పంచులు, ఉప సర్పంరులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సర్పంచులు, ఉప సర్పంచులకు శుభకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచులుగా ఎన్ని కైన అభ్యర్థులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

గ్రామాలను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తమవంతు సహాకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, నాయకులు, ఏకగ్రీవ సర్పంచులు, ఉప సర్పంచులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

