గిరిజ‌నుల‌కు మ‌రుపురాని స‌ర్కారు కానుక

తాండూరు రాజకీయం వికారాబాద్

గిరిజ‌నుల‌కు మ‌రుపురాని స‌ర్కారు కానుక
– ఆదివాసి గిరిజనుల అభ్యున్నతికి ప్రాధన్యం
-10 శాతం ఎస్టీలకు రిజిర్వేషన్ పెంపు చారిత్రాత్మకం
– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
– తాండూరులో ఘనంగా సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆదివాసి గిరిజనుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తోందని తాండూరు నేతలు అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన ఆదివాసీలకు 6శాతం రిజర్వేషన్ నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో జారీ చేయడంపై తాండూరులో సంబరాలు జరుపుకున్నారు. శనివారం ఐటీ శాఖ, పురపాలక శాఖ మంత్రి పిలుపు మేరకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల‌ దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(న‌యూం) తదిదరులు గిరిజనులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

అనంతరం రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ల‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తాండాలను పంచాయతీలుగా మార్చడం, సంక్షేమ పథకాలను అమలు చేయడం సంతోషకరమన్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఆదివాసి గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను పెంచడం చారిత్రాత్మకమన్నారు. ఆదివాసి గిరిజనులు సీఎం కేసీఆర్ మ‌రుపురాని కానుక అందించార‌ని, ఇందుకు అంద‌రు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్. కౌన్సిలర్లు, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.