కంగ్రాట్స్.. కల్పన..!

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

కంగ్రాట్స్.. కల్పన..!
– అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి
– మహిళ క్రికెటర్ ను అభినందించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కంగ్రాట్స్ కల్పన అంటూ తాండూరుకు చెందిన మహిళ క్రికెటర్ ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అభినందించారు. తాండూరు పట్టణానికి చెందిన కల్పనను ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా బీసీసీఐ అండర్-19 టీ-20 రాష్ట్ర జట్టుకు స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈనెలలో చెన్నైలో జరిగే అండర్-19 టీ – 20 టోర్నమెంట్లో ఆమె పాల్గొనబోతోంది. ఆదివారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కల్పన నివాసానికి చేరుకున్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైన కల్పనను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అభినందించారు. కల్పన అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కల్పనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి, నాయకులు మసూద్, మౌసమ్, మాజర్, మోసిన్, యువనాయకులు బిర్కడ్ రఘు, రోంపల్లి సంతోష్ కుమార్, అశోక్, నవీద్ తదితరులు ఉన్నారు.