మా మమ్మీ దొంగ..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

మా మమ్మీ దొంగ..!
– చాక్లెట్లు దాచేసింది.. కొడుతోంది
– అమ్మను జైల్లో బంధించండి
– పోలీసులకు మూడేళ్ల బాలుడి ఫిర్యాదు
దర్శిని డెస్క్‌: మా మమ్మీ దొంగ.. నా చాక్లెట్లు దోచుకుని దాచేసింది.. తినడానికి అడిగితే.. కొడుతోంది.. మా అమ్మను జైల్లో పెట్టండి మేడం అంటూ ఓ మూడేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిని ఎమోషనల్ బ్లాక్ మేయిల్ చేసి మరీ పోలీస్టేషన్‌కు వెంట తీసుకెళ్లి మీరీ కంప్లైట్ ఇచ్చాడు. నెట్టింట్లో ఈ సంఘటన వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్‌ తల్లి అతనికి వాళ్ల అమ్మ తల స్నానం చేయించాక కాటుక పెడుతుంటుంది. కాటుక పెట్టించుకోవడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదంటూ అల్లరి చేస్తే చెంపమీద కొడుతోంది. తినడానికి చాక్లెట్లు ఇవ్వకుండా దాచేస్తుంది. దాచుకున్న చాక్లెట్లను దోచుకుంటుంది. ప్రతిరోజూ మమ్మీ ప్రవర్తనపై అలిగిన సద్దాం జైలుకు పంపించాలని నిర్ణయించుకున్నాడు. తండ్రితో విషయం చెప్పి పోలీస్టేషన్‌కు వెళ్దామని పట్టుబట్టాడు. కుమారుడి ఏడుపు చూడలేక తండ్రి పోలీస్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ప్రియాంకా నాయక్‌కు సద్దామ్‌ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. పైన తల్లి చేస్తున్న విషయాలన్నీ వీడియాలో చెప్పుకొచ్చాడు. చాక్లెట్లు, మిఠాయిలు తిననివ్వడం లేదని తెలిపాడు. అల్లరి చేస్తే వద్దని చెంప మీద దెబ్బలు వేస్తుందని అయామకంగా ఫిర్యాదు చేశాడు. మా అమ్మను జైల్లో పెట్టాలని కంప్లైట్ చేశారు. ఫిర్యాదు తీసుకున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్‌కు మూడేళ్ల సద్దామ్‌ చేతులు జోడించి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలిపాడు. ఫిర్యాదుపై పోలీసులు బాలుడి సంతకం కూడా తీసుకున్నారు. అప్పటికి కానీ.. చిన్నారి కోపం తగ్గలేదు. అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. వీడియో కోసం లింక్ ఓపెన్ చేయండి..

https://dainik-b.in/zlj8lRQTbub