రోడ్లపై తోపుడు బండ్లు తీసేయండి

క్రైం తాండూరు వికారాబాద్

రోడ్లపై తోపుడు బండ్లు తీసేయండి
– ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించేలా ఉన్న తోపుడు బండ్లను వెంటనే వెనక్కి తీసేయాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిబంధనలను సీఐ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. రోడ్లపై ముందుకు వచ్చి కొందరు తోపుడు బండ్లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడుతూ రోడ్లపై తోపుడు బండ్లు పెట్టవద్దని, ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. తోపుడు బండ్లను రోడ్డుపైకి తీసుకరావడం వల్ల రోడ్డుకు ఇరుకుగా మారుతుందన్నారు. దీని వల్ల ట్రాఫిక్ ఏర్పడి ప్రమాదాలు జరిగే అస్కారం ఉంటుందన్నారు. కావున తోపుడు బండ్లను వెనక్కి తీసుకోవాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి తోపుడు బండ్లు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా వాహనదారులు కూడ రోడ్లపై ఇష్టారాజ్యంగా బైకులు, ఇతర వాహనాలను పార్కింగ్ చేయరాదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పట్టణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.