యూట్యూబ్‌లో 17లక్షల వీడియోలు డిలీట్

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

యూట్యూబ్‌లో 17లక్షల వీడియోలు డిలీట్
– 73.7 కోట్ల కామెంట్ల తొలగింపు
– ఎందుకో ప్రకటించిన సంస్థ
దర్శిని డెస్క్: అరచేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్‌లో వీడియోల అప్‌లోడ్‌ చేసేవారితో పాటు చూసే వారి సంఖ్య కూడ పెరిగిపోయింది. మరోవైపు వీడియోలకు కామెంట్లు వెలువెత్తునున్నాయి. ఈ నేపథ్యంలో అశ్లీత, అసత్య కంటెంట్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూట్యూబ్‌ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్దంగా ఉన్న వీడియోలను ఎప్పటికప్పుడు తొలగిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో 17లక్షల వీడియోలను తొలగించింది. 2022 జులై- సెప్టెంబరు త్రైమాసికంలో పర్యవేక్షణలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడిచింది. అయితే 17లక్షల వీడియోలు అన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్నట్లు గుర్తించడం జరిగిందని.. ఈ కారణంగానే ఆ వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. దీంతో పాటు యూట్యూబ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న 73.7 కోట్ల కామెంట్లను కూడా డిలీట్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 99 శాతం కామెంట్లను యూట్యూబ్‌లోని ఆటోమేటెడ్ సాంకేతికత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిందని పేర్కొంది. మిగిలిన ఒక శాతం కామెంట్లపై యూజర్లు అభ్యంతరం తెలపడంతో వాటిని తొలగించినట్లు యూట్యూబ్‌ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 56 లక్షల వీడియోలను తొలగించినట్లు వెల్లడించింది. వీటిలో 36 శాతం వీడియోలను కేవలం ఒక్కరు మాత్రమే వీక్షించగా, 31 శాతం వీడియోలను ఒకటి నుంచి పది మంది మాత్రమే చూశారని తెలిపింది. వీటిని మెషీన్‌లెర్నింగ్ సాయంతో తొలగించినట్లు నివేదికలో పేర్కొంది.