సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
– చెక్కులు అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)లు తాండూరు పట్టణం ఘనాపుర్ వార్డుకు చెందిన మంజులకు రూ.60వేలు, మల్ రెడ్డిపల్లికి చెందిన వెంకటమ్మకు రూ. 48 వేలు, 35వ వార్డుకు చెందిన నిసార్ హైమద్ కు రూ.30వేలు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన ఎల్ఎసీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక చేయూత అందిస్తుందన్నారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, ముక్తార్, నాయకులు నరేందర్ గౌడ్, న్యాయవాది గోపాల్, నీరటి హన్మంతు. అబ్దుల్ రజాక్, రాజన్ గౌడ్, విద్యాసాగర్, చెన్ బసప్ప, మోహిజ్ తదితరులు పాల్గొన్నారు.

