పేద విద్యార్థుల సేవలో..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పేద విద్యార్థుల సేవలో..!
– 300ల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు
– అందజేసిన తాండూరు మార్వాడి యువమంచ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు తాండూరు మార్వాడీ యువమంచ్ చేయూతనందించింది. ప్రతి యేడాది మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తోంది. తాజాగా మంగళవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం మండలంలోని గౌతాపూర్ ప్రాథమిక పాఠశాల, సిరిగిరిపేట్ లోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులకు మొత్తం 300ల మంది వి. ద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచ్ సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నోటు పుస్తకాలను అందజేయడం. జరుగుతుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచ్ సభ్యులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, సభ్యులు పవన్ పోని, అనిల్ సార్డా, ఆశిష్ సార్డా, ముఖేష్ సోమాని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!