కార్పెంటర్ కుటుంబానికి భరోసా

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కార్పెంటర్ కుటుంబానికి భరోసా
– రూ. 10వేలు అందజేసిన అసోసియేషన్‌ సభ్యులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: చాతినొప్పితో చికిత్స పొందుతూ మృతి చెందిన కార్పెంటర్ కుటుంబానికి తాండూరు కార్పెంటర్ అసోసియేషన్ భరోసా అందించింది. తాండూరు మండలం మండలం అంతారం గ్రామానికి చెందిన కార్పెంటర్ సారా మోహన్‌లాల శనివారం మధ్యాహ్నం చాతినొప్పితో జిల్లా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆదివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్పెంటర్‌ అసోసియేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ యువ నాయకులు ఈర్షాద్, సభ్యులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అసోసియేషన్ తరుపున కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పెంటర్ వృత్తితో జీవనం సాగించి మృతి చెందిన మోహన్ లాల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుని కుటుంబానికి అసోసియేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విష్ణు చారి, సభ్యులు, కార్పెంటర్లు తదితరులు ఉన్నారు.