గ్రామీణ క్రీడాకారులందరు రాణించాలి
– టాలెంట్ ఉన్నోళ్లను ప్రోత్సహిస్తాం
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్
– జినుగుర్తిలో ఉత్సహాంగా వాలీబాల్ టోర్నమెంట్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు అన్ని టోర్నమెంట్లలో రాణించాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్ అన్నారు. ఆదివారం తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో వాలీ బాల్ టోర్నమెంట్ ఉత్సహాంగా ప్రారంభమయ్యింది.

తాండూరు నియోజకవర్గం వడ్డెర సంఘం నాయకులు, జినుగుర్తి గ్రామానికి చెందిన రాములు కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ను సునీతా సంపత్ కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీనివాస్ జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
గ్రామీణ క్రీడాకారులు అందరు పోటీల్లో రాణించాలన్నారు. క్రీడల్లో సత్తాచాటే టాలెంట్ ఉన్న క్రీడాకారులందరిని తాండూరు బాలాజీ ఆసుపత్రి తరుపున ప్రోత్సహించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు స్పోర్ట్స్ టీ-షర్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ చంద్, వాలీ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు రాములు, సిరియాళ, రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ ప్రవీణ్ గౌడ్, యువనాయకులు అంజద్, పాఠశాల హెచ్ఎం మృత్యుంజయ స్వామి, క్రీడాకారులు ఎం. శేఖర్, శ్రీకాంత్, శ్రీధర్, గొరేప్ప, ప్రవీణ్, కమ్మరి కిషన్ నాయక్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


