టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన నేతలు

తాండూరు రాజకీయం వికారాబాద్

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన నేతలు
– మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను తాండూరు కాంగ్రెస్ నేతలు కలిశారు. మంగళవారం గాంధీభవన్ కు వెళ్లిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తదితరులు అక్కడ టీపీపీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మ హేష్ కుమార్ గౌడ్ పార్టీ పటిష్టానికి నిరంతరం కృషి చేయాలని సూచించినట్లు ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆయన ఆదేశాలు కొత్త స్ఫూర్తిని ఇచ్చాయని అన్నారు. అందరం కలిసి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామని ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు.