ఆర్టీసీ బస్ డ్రైవర్ కిడ్నాప్‌

క్రైం తెలంగాణ హైదరాబాద్

ఆర్టీసీ బస్ డ్రైవర్ కిడ్నాప్‌
– చాకచక్యంగా కిడ్నాపర్లను గుర్తించిన పోలీసులు
– హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: అతనేం ఆస్తిపరుడు కాదు. పేరున్న వ్యక్తి కూడ కాదు. కేవలం ఆర్టీసీ బస్సుకు తాత్కాళిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ మహానగరంలో ఆ ఆర్టీసీ డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యహరించి కిడ్నాపర్లను అరెస్టు చేవారు. ఇంతకీ ఈ కిడ్నాప్ ఎందుకు చేశారో వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన వెంకటేశ్ దిల్‌సుఖ్ నగర్-2 డిపోలో తాత్కాలిక డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే సంగారెడ్డికి చెందిన నవీన్ వద్ద కొంత కాలం వెంకటేశ్ తన స్నేహితుడికి హామీ కింద అప్పు ఇప్పించాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌ స్నేహితుడు తీసుకున్న అప్పు నవీన్‌కు సకాలంలో పూర్తిగా చెల్లించలేదు. పైగా ఫోన్‌ చేసినా తీయడం లేదు. అప్పు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో విసుగు చెందిన నవీన్ తన కలిసి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌ను కిడ్నాప్ చేయించాడు. వెంటనే వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్రాప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసు బృందాలు రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులోని ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్లను గుర్తించి, అరెస్ట్‌ చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను విచారించి పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఓ పోలీసధికారి మీడియాకు తెలిపారు.