తాండూరు కళాకారుడికి నటరాజ అవార్డు
– ఆనందయ్య చేతుల మీదుగా సత్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన కళాకారుడు స్వస్తిక్ డ్యాన్స్ అకాడమి అధ్యక్షులు, మాస్టర్ రమేష్‌కు నటరాజ అవార్డు వరించింది. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో ప్రైడ్ ఇండియా కల్చరల్ అండ్ సిటిజన్ వెల్పేర్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన లాస్యం జాతీయ నృత్యోత్సవంలో రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్బీబీ నాయుడుతో పాటు కరోనా మహమ్మారికి ఆయుర్వేద మందును కనుగొన్న ఆనందయ్య చేతుల మీదుగా రమేష్‌కు నటరాజ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనకు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ కలియు భోధిధర్మగా అభివర్ణిస్తున్న ఆనందయ్య చేతుల మీదుగా అవార్డు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్, వెల్పేర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా.కృష్ణభట్, కార్యదర్శి డా.కోలా వెంకటేశ్వర్‌రావులు ఉన్నారు.

