భారీ.. భారీగా..!
– సీఎం సభ జయప్రదానికి జన సమీకరణ
– తాండూరు నుంచి 30వేల మంది తరలింపు
– బైపాస్ బాధితులకు అన్యాయం చేయం
– త్వరలోనే మున్సిపల్ వివాదానికి పరిష్కారం
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సుధీర్ఘ విరామం తరువాత వికారాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరులో శిలా పలానికి పరిమితమైన బైపాస్ రోడ్డు, పాత తాండూరు రైల్వే బ్రిడ్జి అభివృద్ధి పనులకు మోక్షం లభించిందన్నారు. అడిగిన వెంటనే మార్కెట్ కమిటికి 30 ఎకరాల స్థలం, పారిశ్రామిక వాడ, ఆటో నగర్ ప్రాజెక్టులకు జీవోలను మంజూరు చేశారని గుర్తుచేశారు. సుదీర్ఘ విరామం తరువాత వికారాబాద్ కేంద్రానికి విచ్చేస్తున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత తెలిపే విధంగా మంగళవారం జరిగే సీఎం బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నామన్నారు. సభ విజయవంతానికి జిల్లా మంత్రి సబితా రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలకు మాత్రమే బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. లక్ష మందితో జరిగే సభకు తాండూరు నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తున్నామన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు, కండువా వేసుకునే ప్రతి కార్యకర్త తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం బహిరంగ సభలో తాండూరుకు నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, బషీరాబాద్ మండలానికి జూనియర్ కాలేజీని మంజూరు చేసే విధంగా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. తాండూరుకు మెడికల్ కాలేజీ దూరమైనా.. జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రితో పాటు కొత్తగా మంజూరైన పట్టణ ప్రాథమిక ఆసుపత్రి, పాత తాండూరులో ఏర్పాటు కాబోతున్న బస్తీ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. బైపాస్ రోడ్డు పరిహారం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సరైన పత్రాలు లేని ఇద్దరు ముగ్గురు బాధితులకు మాత్రమే పరిహారం అందలేదని, త్వరలోనే వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాద్దాంతంలో ఆధిష్టానం స్థానికంగా పరిష్కరించుకోవాలని సూచినట్లు చేసిన వాఖ్యలు అవాస్తమన్నారు. కేసీఆర్ ను నేరుగా కలిసి పరిస్థితి లేదని, కేటీఆర్ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వారిని కలిసే పరిస్థితి లేనప్పుడు ఎవరు కలిసి మాట్లాడారో వాళ్లకే తెలియాలన్నారు. త్వరలోనే ఈ రాద్ధాంతానికి పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చె శారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్. పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అధికార ప్రతినిధి రాజుగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, మహిళ కన్వినర్ శకుంతల దేశ్ ముఖ్ పాండే, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


