ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ యువనాయకులు
– బిర్కడ్ రఘును పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువనాయకులు బిర్కడ్ రఘు ఆసుపత్రిలో చేరారు. మొన్న ఓ రోడ్డు ప్రమాదంలో రఘు గాయాల పాలు అయ్యారు. ఆయన కుడికాలికి ఫ్యాక్చర్ అయ్యింది. దీంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని జాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జాయ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బిర్కడ్ రఘును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆత్మస్థైర్యం పెంచుకోవాలని, ధైర్యంగా ఉండి.. త్వరగా కోలుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిర్కడ్ రఘు సతీమణి జ్యోతి, యువనాయకులు పునీత్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం రఘు పరిస్థితి ఆరోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

