టీఆర్ఎస్ ప‌టిష్ట‌త‌కు కృషి చేయండి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

టీఆర్ఎస్ ప‌టిష్ట‌త‌కు కృషి చేయండి
– నూత‌న అధ్య‌క్షుల‌తో మంత్రి స‌బితారెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప‌ట్లోళ్ల స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ నూత‌న అధ్య‌క్షులుగా నియామ‌కైన ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), తాండూరు మండ‌ల అధ్య‌క్షులు జి.రాందాస్, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులు కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్, యాలాల మండ‌ల అధ్య‌క్షులు మ‌ల్లారెడ్డి, బ‌షీరాబాద్ మండ‌ల అధ్య‌క్షులు రాములు నాయ‌క్‌లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి నూత‌న అధ్య‌క్షుల‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రితో క‌లిసి టీఆర్ఎస్ పార్టీని మ‌రింత ప‌టిష్టం చేసేందుకు కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ మ‌హిళ నాయ‌కురాలు శ‌కుంత‌ల‌, తాండూరు నాయ‌కులు ఉన్నారు.