కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే..!
– సమతౌల్యమైన పోషకాహరం అవసరం
– ఈ అలవాట్లతో సంరక్షణ సాధ్యం
దర్శిని డెస్క్‌: సాంకేతిక రంగం దినదినాభివృద్ధిలో భాగంగా ఎన్నో ఆధునిక పరికరాలను కళ్లతో పరిశీలించాల్సి వస్తుంది. అందులో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం మీ కళ్ళకు ప్రాణాంతకంగా మారింది. ఈ విషయం జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్‌లోని ఒక అధ్యయనంలో స్పష్టమైంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన పోషకాహారం అవసరం. కళ్ళు సురక్షతంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. జంక్ పుడ్ బదులుగా కూరగాయలు మరియు పండ్లు తినాలి. మరియు ‘విటమిన్ ఏ ‘కలిగిన చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నారింజ, క్యారెట్లు వంటి ఆహార పదార్థాలు మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్రమంలో కంటిచూపు సంరక్షణ కోస మీరు పండ్లు, కూరగాయల రసాలను త్రాగవచ్చు.

కొబ్బరి నీళ్లు: ఇది కళ్ళ సంరక్షిత కణజాలాలను మెరుగుపరచడంలోఎంతగానో సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో విటమిన్ సి, ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పాటు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆరెంజ్ జ్యూస్: ఈ జ్యూస్ తాగడం వల్ల కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి ప్రధాన వనరులలో ఆరెంజ్ ఒకటి.

టమోటా రసం: కళ్లకు కావాల్సిన పోషకాలు చాలా వరకు టమోటా రసంలో ఉంటాయి. టమాటాలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం వంటి పలు పోషకాలు మన కంటి చూపును పెంచడంలో ఇంకా కాపాడడంలో సహాయపడతాయి.

ఆకు కూరలు : ఆకు కూరల్లోని యాంటీఆక్సిడెంట్స్‌కు మంచి మూలం. ఇవి మన కళ్ళకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి కంటిపై పడే హానికరమైన కాంతి కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.