రండి.. అన్నదానంలో పాల్గొనండి..!
– శ్రీశైల శివభక్తులకు అన్నదానం
– మూడు రోజుల నిర్వహణకు ఏర్పాట్లు
– శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే శివ భక్తులకు తాండూరు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ శుభవార్త చెప్పారు. శ్రీశైలం శైవ క్షేత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి యేడాది శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలలో శంకర్ భక్తులకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ యేడాది కూడ ఈనెల 13, 14, 15వ తేదిలలో మూడు రోజుల రోజుల పాటు అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని శంకర్ యాదవ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశైల దేవస్థానం పాతాళగంగ దారిలో కాటేజీ నెంబర్ 100 వెనుకాల అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ అన్నదానంలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించాలని బావనోళ్ల శంకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

