మార్మోగిన శరణు గోష..!
– మహా పడిపూజలో తరించిన పట్నం రినీష్ రెడ్డి
– పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని అయ్యప్పస్వామి ఆలయం గురువారం అయ్యప్ప దేవాలయం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునితామహేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆలయంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో మహేందర్రెడ్డి, సునితామహేందర్ రెడ్డిల కుమారుడు రినీష్ రెడ్డి పాల్గొన్నారు. గురు స్వాములు రినీష్ రెడ్డి చేత పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామ్రుతాలతో అభిషేకం చేశారు. అనంతరం జరిగిన మెట్ల పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. స్వామి పల్లకి సేవ, స్వాముల నృత్యాలు కమణీయంగా జరిగాయి. పూజ అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు మహేందర్ రెడ్డితో పాటు సతీమణి సునితారెడ్డి, కుమారుడు రినీష్ రెడ్డిలు స్వయంగా అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటి కోఆర్డినేటర్ కరణం పురుషోత్తంరావు, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్, మాజీ జెడ్పీటీసీలు రాకేష్ మహరాజ్, సిద్రాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు విశ్వనాథ్ గౌడ్, స్వప్న పరిమళ్, మాజీ కౌన్సిలర్లు పరిమళ, శోభారాణి, అనురాధ, నర్మదాదేవి, సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్, శ్రీనివాస్ చారి, బసిరెడ్డి, మల్లారెడ్డి, శివకుమార్, నవంది పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, గడిల రవీందర్, బిడ్కర్ రఘు, భగవాన్, సిద్దు, సాయిరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

