హర హర శంకరా..!

తాండూరు వికారాబాద్

హర హర శంకరా..!
– తాండూరులో మహా శివరాత్రి సందడి
– దేవాలయాలలో శివునికి పూజలు, అభిషేకాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: హర హర శంకరా.. శంభో శివ శంకరా.. అంటూ శివ నామస్మరణతో తాండూరులో మహా శివరాత్రి ఉత్సవ సందడి మొదలైంది. శనివారం మహా శివరాత్రి సందర్భంగా తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం, అంతప్ప భావి, చెరువెంటి ఈశ్వరాలయం, పాత తాండూరులోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం, కోటేశ్వర దేవాలయ తదితర దేవాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మహా శివరాత్రి పర్వదినాన మహా శివున్ని దర్శించుకుంటే శివానుగ్రహం సిద్దిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకేనే శివున్ని సల్లంగా చూడమని దర్శించుకుని వేడుకుంటారు. ఇందులో భాగంగా శివరాత్రిని పురస్కరించకుని భద్రేశ్వరాలయంలో శివ స్వాములు, భక్తులు శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలతో ముక్కంటి తడిసి ముద్దయ్యాడు. అదేవిధంగా ఇతర దేవాయాలలో భక్తులు కుటుంబ సమేతంగా శివయ్యలను దర్శించుకున్నారు. దేవాలయాల్లో భక్తులు భారీగా తరలి రావడడంతో ఆలయాల ప్రాంగణాలు కిక్కిరిసి పోయాయి.