తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌పై కేసు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌పై కేసు
– కౌన్సిలర్‌తో పాటు మరికొందరిపై కూడ
– ప్రకటించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చైర్‌ పర్సన్‌తో పాటు ఓ కౌన్సిలర్, మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని సోమవారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని శివాజీ చౌరస్తాలో శోభాయాత్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వల్న ఉద్రిక్తత జరిగింది. ఈ క్రమంలో వేధికపై ఉన్నచైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ రాముతో పాటు మరికొందరు పోలీసుల ఆదేశాలు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. పోలసుల విధులకు ఆటంకం కలిగిస్తూ చైర్‌ పర్సన్ స్వప్న పరిమళ్‌ రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేశారని అన్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ డౌన్ డౌన్, DSP డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారని తెలిపారు. ఈ మేరకు చైర్‌ పర్సన్, కౌన్సిలర్‌తో పాటు పోలీస్ ల విధులకు ఆటంకం కలిగించిన మరికొందరిపై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు.