దీపానికి ఇళ్లు అహుతి..!

క్రైం తాండూరు వికారాబాద్

దీపానికి ఇళ్లు అహుతి..!
– వంట సామాగ్రి, వస్తువులు దగ్దం
– పాత తాండూరులో అగ్ని ప్రమాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవుని ముందు వెలిగించిన దీపం మంటలకు ఓ ఇళ్లు అహుతైంది. ఇంట్లో ఉన్న వంట సామాగ్రి, వస్తువులు దగ్దమై పోవడంతో నిరుపేద మహిళ నిరాశ్రయురాలైంది. ఈ సంఘటన శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో జరిగింది. స్థానికులు, తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత తాండూరులోని హనుమాన్ దేవాలయ సమీప ప్రాంతానికి చెందిన గాజుల సులోచన ఇంట్లో గత కొన్ని నెలలుగా వెంకటమ్మ అనే మహిళ అద్దెకు ఉంటుంది. కూలీ పనులు చేసుకుంటూ ఒక్కర్తే జీవనం సాగిస్తుంది. శుక్రవారం ఇంట్లో దేవునికి పూజ చేసి దీపం వెలిగించింది. అనంతరం ఆమె పనినిమిత్తం ఇళ్లు మూసి బయటకు వెళ్లింది. కొద్ది సేపటికే ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఇంటి పైకప్పును తొలగించి పరిశీలించారు. మంటలు అంటుకున్న విషయాన్ని గమనించి తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు రాకముందే సమీపంలోని బోరు మోటారు నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అధికారులు వచ్చే సమయానికి దాదాపు మంటలను మొత్తం ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో దేవునికి ముందు వెలిగించిన దీపాన్ని ఎలుకలు కదిలించడంతో అగ్ని ప్రమాదం జరిగిందని నిర్దారాణకు వచ్చారు. అగ్ని ప్రమాదంతో ఇంట్లో ఉన్న వంట సామాగ్రితో పాటు దస్తువులు, వస్తువులు దగ్దమైనట్లు స్థానికులు తెలిపారు.