రేపటి నుంచి టోల్ బాదుడు

జాతీయం టెక్నాలజీ తెలంగాణ మహబూబ్ నగర్ వికారాబాద్ హైదరాబాద్

రేపటి నుంచి టోల్ బాదుడు
– పెరిగిన చార్జీలు అర్దరాత్రి తరువాత అమలు
– ఎంతశాతం వసూలు చేస్తున్నారంటే
దర్శిని డెస్క్‌: దేశవ్యాప్తంగా రేపటి నుంచి టోల్‌ చార్జీల బాదుడు షురూ కాబోతోంది. ఏప్రిల్‌ 1 నుంచి అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచే పెరిగిన చార్జీలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రతీ ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్‌ ఛార్జీలను సమీక్షిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా టోల్‌ ఛార్జీలు పెంచనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా( ఎన్ హచ్ఏఐ) నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ టోల్‌ చార్జీలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ ఏడాది టోల్‌ ఛార్జీలు ఏకంగా 5 నుంచి 10 శాతం పెరగనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనలపై టోల్‌ ధరలు రూ. 10 నుంచి రూ. 60 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెరిగిన టోల్‌ ఛార్జీల వల్ల కార్లు, జీపులకు రూ.5 నుంచి రూ.10కి, బస్సులు, లారీలకు రూ.15 నుంచి రూ.25కి, భారీ వాహనాలకు రూ.40 నుంచి రూ.50కి పెరగనుంది. ఇక సింగిల్‌, డబుల్‌ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.