భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి
– శబరికి బయల్దేరిన అయ్యప్ప స్వాములు
– పూజలో పాల్గొన్న వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మంగళవారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వీరేందర్ రెడ్డి, సాయిరెడ్డి స్వాములతో పాటు. పలువురు స్వాములు ఇరుముళ్లను కట్టుకున్నారు. వేద పండితులు, గురుస్వాముల మంత్రోచ్చరణలతో ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది.

అనంతరం స్వాములు ఇరుముళ్లను కట్టుకుని అయ్యప్ప కీర్తనలతో ఆట పాటలు ఆడారు. తలపై ఇరుముళ్లను పెట్టుకుని శబరిమలైకు బయల్దేరి వెళ్లారు. అంతకుముందు జరిగిన ఇరుముళ్ల కార్యక్రమానికి తాండూరు వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి, పాలేపల్లి చంద్రారెడ్డి, సురేందర్ రెడ్డి, అయ్యప్ప స్వాముల కుటుంబ సభ్యులు తరలివచ్చారు. అయ్యప్ప స్వామి, ఇరుముళ్లతో శబరికి బయల్దేరిన స్వాములను దర్శించుకుని మొక్కుకున్నారు. ఇరుముళ్ల కార్యక్రమంతో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

