ఆపిల్ కిడ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఆపిల్ కిడ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్
– గుణాత్మక విద్యనందించడే లక్ష్యం
– స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం షావుకార్పేట్ ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి ప్రిన్సిపాల్ వనజ యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను (సర్టిఫికెట్స్) అందజేశారు. విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్లే గ్రూప్ నుంచే విద్యార్థులకు ఆటపాటలతో కూడిన గుణాత్మక విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు. మేధావుల అభిప్రాయాల అనుగుణంగా చిన్నారుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యను వ్యాపారంగా కాకుండా సేవాభావంతో, సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తులుగా నేటి తరంను తయారు చేసేందుకు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వనజ, టీచర్లు హారిక, సుష్మ, అరుణ పాల్గొన్నారు.