గ‌ణేషాయా.. న‌మోస్తుతే..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

గ‌ణేషాయా.. న‌మోస్తుతే..!
– వినాయ‌కుల‌ను ద‌ర్శించుకున్న రాజుగౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలో ప్ర‌తిష్టించిన వినాయ‌కుల‌ను హిందూ ఉత్స‌వ స‌మితి గౌర‌వాధ్య‌క్షులు, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్ ద‌ర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన గ‌ణ‌నాథుల‌ను ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం తాండూరు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవ‌ల‌ప‌ర్స్ అధినేత శంక‌ర్ యాద‌వ్‌తో క‌లిసి భ‌క్తుల‌కు అన్న‌దానం చేశారు.
ఈ సంద‌ర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ ముందుమొక్కుల గణేషుని ఆశీస్సులు ప్ర‌జ‌ల‌పై ఉండాల‌ని వేడుకున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మాజీ కౌన్సిల‌ర్ స‌రితా హ‌రిగౌడ్, నాయ‌కులు హ‌రిహ‌ర‌గౌడ్, ఆయా మండ‌పాల స‌మితి స‌భ్యులు, భ‌క్తులు పాల్గొన్నారు.