ఎమ్మెల్సీ వర్గానికి షాక్..!
– ఎమ్మెల్యే పంచన నేరిన డీవీఆర్
– 200 మందితో కలిసిన పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మద్య వర్గపోరు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా ఆధిపత్య ప్రదర్శనకు పోరు సాగిస్తున్నారని అందరికి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ వర్గానికి గట్టి షాక్ తగిలింది. పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలోకి చేరారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలోకి చేరారు. ద్యావరి విష్ణువర్దన్ రెడ్డితో పాటు రేగొండి సర్పంచ్ హైదర్, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ రావు, వార్డ్ మెంబర్ సత్తార్,సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, బోయిని నర్సింహులు, బ్యాగరి నర్సింహులు, ధర్మీది వెంకటయ్య, డబుల నర్సింహులు ,అశోక్ గౌడ్, విష్ణు అన్న యువసేన సభ్యులు, అరుణ్, నరేష్, రవికిరణ్, అధిల్,అశోక్ రెడ్డి, మఠం మల్లు, పుర్గుర్తి రాజు, శివ తదితరులు ఎమ్మెల్యే వర్గంలో చేరారు. ఈ సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ యాదవ్,నరేష్ రెడ్డి, శిబ్లి, లక్ష్మణ్ నాయక్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,యువకులు, తదితరులు పాల్గొన్నారు. అయితే తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి భారీ అండగా ఉన్న విష్ణువర్దన్ రెడ్డి ఎమ్మెల్యే వర్గంలో చేరడంతో ఎమ్మెల్సీ వర్గానికి భారీ దెబ్బ తగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

