ఆత్మరక్షణ విద్యల్లో రాణించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్, సర్టిఫికెట్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మరక్షణ విద్య కరాటే, కూన్పులలో క్రీడాకారులు రాణించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం విశ్వవేద పాఠశాల ఆవరణలో క్రీడాకారులకు బెల్టులు, సర్టిఫికెట్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై కరాటే ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు బ్లాక్ బెల్టు, ఎల్లో బెల్టు, గ్రీన్ బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు అందరు ఆత్మరక్షణ విద్య కరాటే, కూప్పులలో రాణించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా అమ్మాయిలు ఆత్మరక్షణ విద్యను తప్పక నేర్చుకోవాలన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకరావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బోయరవి, కరాటే మాస్టర్లు సాయి మాస్టర్, వికారాబాద్ ఖాజా మాస్టర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…
సూపర్ పోలీస్..!
– నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ
– చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు
– డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు
https://dharshininews.com/17404


