సూపర్‌ సోనాలి..!

క్రైం తెలంగాణ హైదరాబాద్

సూపర్‌ సోనాలి..!
– రైలు కిందపడిపోతున్న మహిళను కాపాడిన వైనం
– సమయస్పూర్తిని మెచ్చుకున్న ప్రయాణికులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: రైల్వే శాఖలో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సోనాలి అనే మహిళ కానిస్టేబుల్‌ సూపర్‌ ఉమెన్‌ అనిపించుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్‎లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకోగా.. క‌దులుతున్న రైలు నుంచి దిగబోయి జారిపడిన ప్రయాణికురాలిని కాపాడింది. వివరాల్లోకెళితే.. మణుగూరు నుండి సికింద్రాబాద్ వెళ్తున్న మణుగూరు ఎక్స్‎ప్రెస్ రైలు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ ప్రయాణికురాలు కిందికి దిగబోయి ప్లాట్ ఫాంకు, రైలుకు మధ్యలో పడింది. దాంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాలి మాల్కే వెంటనే స్పందించింది. మహిళను పైకి లాగి ప్రాణాలు కాపాడింది. దాంతో అక్కడే ఉన్న ప్రయాణికులు.. సోనాలిని మెచ్చుకున్నారు. విషయం తెలిసుకున్న ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు సోనాలి మాల్కేను అభినందించారు.

ఇదికూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage