ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
– ఇక పల్లెవెలుగు బస్సుల్లో టీ-9 టికెట్
– 60 కిలో మీటర్ల ప్రయాణానికి చెల్లుబాటు
– మహిళలకు, వృద్ధులకు ఎలాంటి లాభం అంటే..?
హైదరాబాద్, దర్శినిప్రతినిధి: ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు సంస్థ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో అమలు చేస్తున్న టీ-24, టీ-6, టీ-9 టికెట్లను విధానంను తాజాగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంత ఆర్టీసీ ప్రయాణికులకు ఈ శుభవార్తను పంచుకుంది. ఇకపై గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులో టీ-9 టిక్కెట్ విధానంను ఆదివారం నుంచి అమలు చేయడం జరుగుతుందని సంస్థ ప్రకటించింది. అయితే మహిళలు, వృద్ధులకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘పల్లెవెలుగు బస్సుల్లో నిత్యం 15 లక్షల మంది ప్రయాణిస్తారు. అందులో మహిళలు, వృద్ధులే అధికం. వారికి ఆర్థికభారం తగ్గించడం కోసమే టీ-9 టికెట్‌కు శ్రీకారం చుడుతున్నాం’ అని సజ్జనార్ వివరించారు.
టీ-9 టికెట్‌తో ఎలాంటి లాభం అంటే..?
మహానగరంలో అమలు అవుతున్న విధానంను పట్టణ, పల్లెలకు విస్తకరించాలని ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను గుర్తించిన ఆర్టీసీ సంస్థ టీ-9 టిక్కెట్టు విధానంను అమలు చేయాలని నిర్ణయించింది. ‘టీ-9 టీకెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్స్‌కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టీకెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. దీంతో ఈ టీకెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని సంస్థ ప్రకటీంచింది. అంతేకాకుండా టోల్ గేట్ చార్జీలపైన మినహాయింపు ఇచ్చింది.
కండక్టర్ల వద్దే టీ-9 టిక్కెట్టు
గ్రామీణ, పట్టణాల్లో వినూత్నంగా అమలు చేస్తున్న ‘టీ-9 టీకెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టీకెట్ పొందవచ్చు. పల్లెవెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద టీ-9 టికెట్లు లభిస్తాయి. మహిళలు, వృద్ధులు రూ.100 చెల్లించి టికెట్ పొందితే 60 కి.మీ పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే చెల్లుబాటు అవుతుంది. పూర్తి వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.
ఇది కూడా చదవండి…


