భలే.. రాఖీ పుష్పం..!
– కోట్రిక వారింట్లో కనువిందు
– రాఖీ పండగ ముందు విరబూత
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాఖీ పండగకు మార్కెట్లో దొరికే రాఖీలే కాదు. ప్రకృతి కూడా అందమైన రాఖీ పుష్పాలను అందిస్తోంది. వాటిని చూశారంటే ఎవరైనా ఫిదా అయిపోతారు.

తాండూరు పట్టణం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో రాఖీ పుష్పం విరబూసింది. లేత వంకాయ రంగులో పూసిన ఈ పూలు చూస్తే చూపు తిప్పుకోనివ్వకుండా కనువిందు చేశాయి. రాఖీ పండగకు ఒక రోజు ముందు ఈ పువ్వులు విరబూయం విశేషం. ఈ పువ్వులను చూస్తుంటే అన్నా చెల్లెళ్ల అనుబంధాలను ప్రకృతి కూడా చాటుకుంటుందని అర్ధమవుతోంది.

చూడాడానికి రాఖీల్లాగా కనిపించడం వల్ల వీటిని రాఖీ పూలు అని పిలుస్తారు. అంతేకాదు వీటిని కౌరవ – పాండవ పుష్పాలు అని కూడా పిలుస్తారు. మరోవైపు ఈ పువ్వులు తీగజాతికి చెందినవిగా పలువురు పేర్కొంటున్నారు. పాకేందుకు ఆధారం ఉంటే చాలు ఈ తీగ ఎగబాకి పూస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పువ్వులను అనేక ఔషధాలలో వినియోగిస్తారని ప్రచారం ఉంది. మానసిక ఒత్తిడి, నిద్రలేని సమస్యలకు వీడిని వినియోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇదికూడా చదవండి…

