ప్రతిభావంతులు రండి..!
– శుభప్రద్ పటేల్ ట్రస్ట్ ద్వారా పురస్కారాలు
– రేపు తాండూరులో పంపిణీకి ఏర్పాట్లు చేసిన ట్రస్ట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంలో ప్రతిభను కనబరిచిన ప్రతిభా వంతులకు పురస్కారాలను అందజేయాలని శుభప్రద్ పటేల్(ఎస్పీ) చారిట్రబుల్ ట్రస్ట్ నిర్ణయించింది. రేపు తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అద్యాపకులకు ఈ ప్రతిభా పురస్కారాల అందజేయడం జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని సల్లా గార్డెన్లో పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా సత్కరించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషనర్ మెంబర్ శుభప్రద్ పటేల్, ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణీల చేతుల మీదుగా పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నారు. కావున నియోజకవర్గంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు. అధ్యాపకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ట్రస్ట్ ప్రతినిధి శ్రీశైలం(సెల్: 9949272357) సంప్రదించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…


