పీఎం కిసాన్ నిధి విడుదల తేది ఖరారు..!
– 14వ విడత మంజూరుపై క్లారీటీ
– రైతులు అర్హతను ఎలా తెలుసుకోవాలంటే..?
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధి మంజూరుపై కీలక ప్రకటన చేసింది. 14వ విడత విడుదలపై క్లారీటి ఇచ్చింది. ఈనెల 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ కింద 13 విడతలుగా నిధులను మంజూరు చేసింది. ఇప్పుడు 14వ విడత నిధులను మంజూరు చేయబోతోంది. వచ్చే గురువారం 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2,000 జమ చేయనున్నారు. మరోవైపు పీఎం కిసాన్ నిధిని రైతులు ఈకేవైసీ చేయని కారణంగా డబ్బులు పొందలేదు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో అర్హతను తెలుసుకోండి ఇలా
ముందుగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలోని రైతుల కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి. అనంతరం రాష్ట్రం , జిల్లా , ఉప జిల్లా , బ్లాక్, గ్రామాన్ని ఎంచుకుని , నివేదిక పొందండిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో హోమ్‌పేజీలో ‘ఫార్మర్స్ కార్నర్’ విభాగంపై క్లిక్ చేయండి. ‘బెనిఫిషియరీ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి. ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి. అనంతరం రైతుల వివరాలను తెలుసుకోవాలి.
ఇది కూడా చదవండి…


