ఆధైర్యపడొద్దు.. ఆదుకుంటాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆధైర్యపడొద్దు.. ఆదుకుంటాం..!
– ఇండ్లు కూలిన బాధితులకు భరోసా
– ఎమ్మెల్యే ఆదేశాలతో పలకరించిన విఠల్ నాయక్
యాలాల, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాలతో ఆగమైపోయిన బాధితులకు తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ భరోసా అందించారు. ఆధైర్య పడోద్దని, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో అందరికి ఆదుకుంటామని దైర్యం చెప్పారు. శనివారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ యాలాల మండలంలో పర్యటించారు. యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి బాధితులను పరామర్శించారు. బానాపూర్ గ్రామంలో వార్త్యా శంకర్ నాయక్ కు సంబంధించిన కూలిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిలో మనో ధైర్యాన్ని నింపి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా అందించారు.

ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో వర్షం కారణంగా కూలిపోయిన ఇండ్ల బాధితులకు ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఇల్లు కూలిన నిరుపేదల వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే బాధితులకు పరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, అచ్యుతాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, దేవనూర్ సర్పంచ్ ఆకుల శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల రైతు సంఘం అధ్యక్షులు అరవింద్ కుమార్ రెడ్డి, సాయిలు, ముద్దాయి పేట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage