పల్లీలలో ప్రోటీన్లు..!
– మోతాదులో తీసుకుంటే బలం
– ఏయే పోషకాలు ఉన్నాయో తెలుసుకోండి
దర్శిని డెస్క: పల్లీలు తింటే ఏవేవో.. సమస్యలు వస్తాయని సామాన్యులకు అనుమానం. అయితే మోతాదులో తీసుకుంటే పల్లీలలోని ప్రోటీన్లను అవసరమైన మేర లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. గుప్పెడు పల్లీలతో అద్భుతమైన శక్తి, ప్రొటీన్లు అందుతాయో అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. వేరుశెనగ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దాం. పల్లీల్లో నూనె శాతం ఉంటుంది కాబట్టి.. 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించి లేదా నానబెట్టి తినొచ్చు. ఇలా తింటే వాతం సమస్య కూడా ఉండదు. రోజూ ఒక గుప్పెడు పల్లీలు.. సుమారుగా 100 గ్రాముల పల్లీలు తీసుకుంటే.. 567 క్యాలరీల శక్తి, 25 గ్రాముల ప్రొటీన్, 45 గ్రాముల కొవ్వు, 705 మిల్లీగ్రాముల పొటాషియం, 9 గ్రాముల ఫైబర్, 25 శాతం ఐరన్, 15 శాతం విటమిన్ బి, 42 శాతం మెగ్నీషియం, 9 శాతం క్యాల్షియం ఉంటుంది.
ప్రతిరోజూ పల్లీలను ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎముకలలో ధృడత్వం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు, బరువు పెరగాలనుకునేవారు, బాలింతలు పల్లీలను వేయించుకుని తినొచ్చు.
ఇది కూడా చదవండి…


