డేంజర్ మంకీ..!

క్రైం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం హైదరాబాద్

డేంజర్ మంకీ..!
– పట్టించినందుకు రూ. 21వేల రివార్డు
– అదుపులోకి తీసుకున్న అటవిశాఖ అధికారులు
దర్శిని డెస్క్‌: డేంజర్ కోతి ఏమిటి.. దాన్ని పట్టించినందుకు రూ. 21 వేల రివార్డు ఏమిటి అని ఆలోచిస్తున్నారా..? అయితే మనషులపై దాడి చేస్తూ మోస్ట్ వాంటెడ్‌గా మారిన కోతి కహానీని తెలుసుకోవాల్సిందే. పదండి మరి వివరాల్లోకి వెళదాం.. మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గడ్‌ ప్రాంతంలో ఓ కోతి రెండు వారాలుగా 20 మందిపై దాడి చేసి నానా భీభత్సం సృష్టించింది. ఇళ్ల చుట్టూ తిరుగుతూ గత 15 రోజులుగా దాదాపు 20 మందిపై దాడి చేసింది. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో కోతి దాడి చేసిన ఘటనలు రికార్డయ్యాయి. కోతి ఓ వృద్ధుడిపై దాడిచేసి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ దాడిలో వృద్ధుడి తొడపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రజలకు హాని తలపెడుతున్న కోతిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని పట్టుకున్నవారికి స్థానిక అధికారులు రూ.21 వేల రివార్డు కూడా ప్రకటించారు.

జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జయిని అటవీ శాఖ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుని డ్రోన్‌ సాయంతో చాకచక్యంగా దానిని బంధించారు. రాజ్‌గఢ్‌లో గురువారం సాయంత్రం (జూన్‌ 22) రెస్క్యూ టీం దీనిని బంధించారు. డ్రోన్ సాయంతో కోతిని గుర్తించి, అనంతరం మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. ఈ కోతిని పట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో 4 గంటలపాటు శ్రమించి కోతిని పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. ఈ క్రమంలో స్థానికులు జై శ్రీరామ్, జై భజరంగ్ దళ్ అంటూ నినాదాలు చేశారు. మత్తు వదిలిన తర్వాత కోతి కోపంతో రగిలిపోయింది. బోనులోంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. మనుషులకు హాని తలపెడుతున్న ఈ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. ఈ బృందానికి రాజ్‌గఢ్ మున్సిపల్ అధికారులు రూ. 21,000 ప్రకటించారు.

ఇది కూడా చదవండి….

తాత తడబడలేదు..!

chaithany collage